HomeMovie NewsAllu Sirish: మెగా హీరోకు ఈసారైనా హిట్టు దక్కేనా..?

Allu Sirish: మెగా హీరోకు ఈసారైనా హిట్టు దక్కేనా..?

- Advertisement -

Allu Sirish: మెగా కాంపౌండ్ నుండి ‘గౌరవం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్, ఆ తరువాత చాలా సినిమాలే చేశాడు. కానీ ఈ హీరోకు తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం పడలేదు. దీంతో చేసిన ప్రతి సినిమా వైవిధ్యంగా ఉన్నా, ప్రేక్షకులను అలరించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఈ హీరో కెరీర్ గ్రాఫ్ ముందునుండీ పడిపోతూనే ఉంది. అయితే ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ప్రేక్షకులను అలరించడంలో కాస్త సక్సెస్ అయినా, కమర్షియల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ గతంలోనే పూర్తయి రిలీజ్‌కు రెడీగా ఉన్నా, పలు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో ఇప్పుడు అన్ని పనులు ముగించుకుని, ఈ సినిమాను నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బజ్ తెప్పించేందుకు చిత్ర యూనిట్ విశ్వప్రయత్నాలు చేసింది. నందమూరి బాలకృష్ణను ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా పిలిచిమరీ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. కాగా, నేడు రిలీజ్ అయిన ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

See also  బ్రహ్మస్త్ర సీక్వెల్స్ విజయం సాధిస్తాయా?

దానికి పలు కారణాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లు శిరీష్ సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉండటం, ఫేడవుట్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ ఈ సినిమాలో నటిస్తుండటం లాంటివే కాకుండా, చెప్పుకోదగ్గ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు లేకపోవడం కూడా ముఖ్య కారణమని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా సక్సెస్ అయితేనే అల్లు శిరీష్ కెరీర్ గట్టెక్కుతుందనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మరి తొలిరోజు మౌత్ టాక్ బాగా వచ్చినా, రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ సరిగా లేకపోతే అల్లు వారి హీరోకు కష్టాలు తప్పవని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు.

Follow on Google News Follow on Whatsapp

See also  నా పై, నా కుటుంబం పై ట్రోలింగ్ చేయిస్తుంది ఒక ప్రముఖ హీరో : మంచు విష్ణు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories